షుగర్‌ ఫ్యాక్టరీలను ధారదత్తం చేస్తే సహించం


వైయస్‌ఆర్‌సీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు
విశాఖ‌:  ఘ‌గ‌ర్ ఫ్యాక్ట‌రీల‌ను ధార‌ద‌త్తం చేస్తే స‌హించేది లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత కారుమూరి నాగేశ్వ‌ర‌రావు హెచ్చ‌రించారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఆయ‌న పాల్గొన్నారు. ఈ మేర‌కు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..ఆంధ్రలో రాక్షస పాలన సాగుతోందని విమర్శించారు. టీడీపీ పాలనలో చక్కెర కర్మాగారాలు అధ్వాన్న పరిస్థి«తుల్లో ఉన్నాయన్నారు. నష్టాల ఊబిలో ఉన్న షుగర్‌ ఫ్యాక్టరీలను తమ బినామీలకు ధారదత్తం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. మూతపడిన షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించడంతో పాటు, నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీలను రాబోయే రోజుల్లో వైయస్‌ జగన్‌ ఆదుకుని కార్మికులకు,రైతులకు భరోసాగా నిలుస్తారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

Back to Top