ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పంట నీట మునక

పశ్చిమలో 50 వేల ఎకరాల పంట వరదార్పణం
సుమారు రూ. 300 కోట్లు నష్టపోయిన రైతులు
ప్రభుత్వం పక్షపాతం లేకుండా అన్నదాతలను ఆదుకోవాలి
పశ్చిమగోదావరి: అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యంతో పశ్చిమ గోదావరి రైతులు తలపట్టుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 50 వేల ఎకరాలు నీట మునిగాయి. ఎ్రరకాల్వ వరద నీరు రూ. 300ల కోట్ల పంట పెట్టుబడిని ముంచేసింది. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కన్వీనర్‌ కారుమూరి నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఏలూరు నియోజకవర్గం తిరుపతిపురం, వరిఘేడు, బల్లిపాడు గ్రామాల్లో మునిగిపోయిన పంటపొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎ్రరకాల్వ తవ్వకుండా ఉండడంతో గ్రామాలకు గ్రామలే కొట్టుకుపోయాయని, దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎ్రరకాల్వ నిర్మించడంతో వరద బెంగ తప్పిందన్నారు. కానీ అధికారులు నిర్లక్ష్యంతో పంట పొలాలన్నీ నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. డ్యామ్‌లు, డోర్లు లీకేజీ వల్ల పంట నీటమునిగిందని, పొలాలన్నీ చెరువును తలపిస్తున్నాయన్నారు. జన్మభూమి కమిటీల సిఫారస్సులు అని నిబంధనలు విధించకుండా పంట పొలాలు నీట మునిగిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే జిల్లా యంత్రాంగం కుదేలయిపోయే ప్రమాదముందన్నారు. వరద రాకముందే ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను కోరితే.. కనీసం స్పందన కరువైందని మండిపడ్డారు. అధికారులు సమగ్ర సర్వే నిర్వహించి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. 
Back to Top