టీడీపీ నేతలకో న్యాయం..ఇతరులకు మరో న్యాయమా?


– టీడీపీ పాలనలో పెరిగిపోయిన అరాచకాలు
– శ్రీ గౌతమి కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి
– వెంకట్రామయ్య చీట్‌ ఫండ్‌ బాధితులను ఆదుకోవాలి

విజయవాడ:  చంద్రబాబు పాలనలో టీడీపీ నేతలకు  ఒక న్యాయం..ఇతరులకు మరో న్యాయమా అని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు కారుమురి నాగేశ్వరరావు ప్రశ్నించారు. విజయవాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ రూపంలో దోచుకున్నా కూడా అధికార పార్టీకి చెందిన వారు కావడంతో మసి పూసి మారడి కాయ చేస్తున్నారని విమర్శించారు. నరసాపురంలో గౌతమి అనే అమ్మాయి హత్య కేసులో అది హత్య అని అందరూ చెబుతున్నా కూడా..రోడ్డు యాక్సిడెంట్‌గా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. సీఐడీ విచారణలో టీడీపీ నాయకుడే హత్య చేశారని వెల్లడైందన్నారు. టీడీపీ నేతలకు ఒక రకమైన న్యాయం..వేరే వారికి మరో న్యాయంగా నడుస్తుందని, ఈ ప్రభుత్వంలో రాచరిక పాలన సాగుతుందన్నారు. వెంకట్రాయ చీట్స్‌ కంపెనీ వేలాది మందిని మోసం చేసిందన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు రూపాయి రూపాయి దాచుకున్న డబ్బును డిపాజిట్‌ చేసుకున్న వెంకట్రాయ కంపెనీ ఖాతాదారుల నెత్తిన శఠగోపం పెట్టిందన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, 136 వారెంట్లు వచ్చినా కూడా వారిని ఏమీ చేయలేకపోతున్నారన్నారు. ప్రభుత్వం 84 జీవో విడుదల చేసి..ఇంతవరకు బాధితులను పట్టించుకోలేదన్నారు. అగ్రిగోల్డు బాధితులను కూడా ఈ ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు.  దోషులను గాలి కొదిలేస్తున్నారని విమర్శించారు. ఇలాగే చేస్తే చంద్రబాబును ప్రజలు క్షమించరన్నారు. రాచరిక పాలన సరైంది కాదని, బాధితులకు న్యాయం చేయకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. మహిళలను వివస్త్రలుగా చేశారని, దళితులపై దాడులు అధికంగా జరుగుతున్నాయని, అమెరికాలో కూడా టీడీపీ నేతలు తెలుగు వారి పరువు పోగొడుతున్నారని మండిపడ్డారు. బాధితులకు పూర్తిగా న్యాయం జరిగే వరకు వైయస్‌ఆర్‌సీపీ పోరాటం చేస్తుందని, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయని హెచ్చరించారు. 
 

తాజా వీడియోలు

Back to Top