చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చే భక్తుల ప్రాణాలు తీసింది..

వాస్తవాలు మరుగుపరిచి భక్తులు,మీడియాపై నిందలా..
వైయస్‌ఆర్‌సీపీ నేత కురుసాల కన్నబాబు
కాకినాడః టీడీపీ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి తప్పందా అంతా భక్తులు,మీడియాదే అంటూ నివేదిక ఇవ్వడం చంద్రబాబు నాయుడు బాధ్యత రహిత్యానికి నిదర్శనమని తూర్పుగోదావరి జిల్లా వైయస్‌ఆర్‌సీపీ కన్వీనర్‌ కురసాల కన్నబాబు విమర్శించారు. ప్రపంచంలో ఇంత పబ్లిసిటీ పిచ్చి ఉన్న  చంద్రబాబు వంటి నాయకుడు  ఎక్కడ ఉండడన్నారు. పుష్కరఘాట్‌లో బోయపాటి శ్రీనుతో సినిమా తీయాలని ప్రయత్నించి 29 మంది ప్రాణాలను గాలిలో కలిపేశారన్నారు. చివరికి సిసి కెమెరాల పుటేజీలను కూడా మాయం చేశారన్నారు. మూడు సంవత్సరాల కాలయాపన చేసి  తూతూమంత్రంగా కమిటీ నివేదిక ఇచ్చి, ప్రజలు గుడ్డి నమ్మకంతో ఉన్నారని చెప్పడం దారుణమన్నారు. చంద్రబాబు విఐసి ఘాట్‌లో చేయకుండా పుష్కర ఘాట్‌లో ఎందుకు స్నానం చేశారో çకమిషన్‌ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. పుష్కర స్నానం చేసిన ప్రతి భక్తుణ్ణి చంద్రబాబు అవమానించారన్నారు. అదే సమయానికి చంద్రబాబు ఎందుకు స్నానం చేశారు..ఫోటోలకు ఎందుకు ఫోజులిచ్చారో చెప్పాలన్నారు. చంద్రబాబు డాక్యుమెంటరీ గుర్తించి ఎందుకు ప్రస్తావించలేదన్నారు. పాలనా నిర్ణయాలు,భద్రతా వైఫల్యం గురించి  కమిషన్‌ నివేదిక పట్టించుకోలేదన్నారు. ప్రజలు గుడ్డినమ్మకంతోనే చంద్రబాబును ఎన్నుకున్నారని ఆ నమ్మకమే ప్రజల కొంప ముంచిందన్నారు. వాస్తవాలు మరుగున పరిచి మీడియాను,భక్తులను బా«ధ్యుల్ని చేసి హద్దుమీరిని ఉత్సాహం, ఉద్రికత్త పరిస్థితులకు దారి తీసిందంటూ నివేదికలో పేర్కొనడం దిగజారుడుతనమన్నారు. కనీస పశ్చాత్తాపం కూడా చంద్రబాబు లేదన్నారు.
Back to Top