కాపు రిజర్వేషన్లు ఎక్కడి వరకు వచ్చాయి?

 – కాపులు, బీసీలకు మధ్య వైరాన్ని సృష్టిస్తున్నారు.
– పచ్చ చొక్కాలకే కాపు కార్పొరేషన్‌ రుణాలు
– పోలవరం చంద్రబాబుకు అవినీతి వరం 
– అన్ని రంగాలను బాబు భ్రష్టు పట్టించారు

కాకినాడ: చంద్రబాబు కులాలను ఓటు బ్యాంకుగా మార్చుకునే రాజకీయాలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ కాకినాడ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విమర్శించారు. టీడీపీ అన్ని కులాలను వంచించే కార్యక్రమాన్ని చేస్తుందన్నారు.  కాకినాడలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు కాపు రిజర్వేషన్లు ఎక్కడి వరకు వచ్చాయని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు కురసాల కన్నబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎందుకు రిజర్వేషన్ల విషయంలో కప్పదాటుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కులాలను చంద్రబాబు ఓటు బ్యాంకుగా సృష్టించి వ్యవస్థను నాశనం చేస్తున్నారని విమర్శించారు. 2014 ఎన్నికల టీడీపీ మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను ఏ మేరకు అమలు చేశారో చెప్పాలని పట్టుబట్టారు. చంద్రబాబు కాపులు, బీసీల మధ్య వైరాన్ని సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు రిజర్వేషన్లపై కేంద్రానికి నివేదిక పంపించి చేతులు దులుపుకుంటే సరిపోదని, మీరేం చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. కాపు కార్పొరేషన్‌కు ప్రతి ఏటా రూ.1000 కోట్లు కేటాయిస్తామన్నారని, ఇప్పటి వరకు టీడీపీ ప్రభుత్వం ఎంత కేటాయించిందని ప్రశ్నించారు. ఎంత ఖర్చు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు. పచ్చ చొక్కాలకే కాపు కార్పొరేషన్‌ రుణాలు అందుతున్నాయన్నారు. అన్ని రంగాలను చంద్రబాబు బ్రష్టు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. నాలుగేళ్లుగా బీసీలను విస్మరించిన చంద్రబాబు ఎన్నికలు వస్తున్నాయని ఇవాళ ఆదరణ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. సిపార్సులకే పథకాలను అమలు చేస్తున్నారని విమర్శించారు. కులాలను ఓటు బ్యాంకుగా చూసే కార్యక్రమాన్ని మానుకోవాలని సూచించారు. కాపు రిజర్వేషన్లకు వైయస్‌ఆర్‌సీపీ అనుకూలంగా మాట్లాడుతుందన్నారు. బీసీ కులాలకు ఇబ్బంది లేకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఇవాళ మంజునాథ కమిషన్‌రాజీనామా చేయడంతో కాపులపై చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. కాపుల రిజర్వేషన్లపై ఏం చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. రాజకీయ ఎత్తుగడలో భాగంగా కాపు రిజర్వేషన్లపై నివేదికలు ఇస్తే సహించేది లేదన్నారు. పోలవరం చంద్రబాబుకు దక్కిన అవినీతి వరమని అభివర్ణించారు. రాష్ట్ర ప్రయోజనాలను  కేంద్రానికి తాకట్టు పెట్టి పోలవరం పేరుతో అవినీతిని విస్తృతం చేశారన్నారు. మట్టి, నుంచి మద్యం దాకా అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. 
 
Back to Top