ప్ర‌జా సంక‌ల్ప యాత్ర చ‌రిత్రలో నిలిచిపోతుంది


విశాఖ‌: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు,  ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ య‌ల‌మంచ‌లి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త క‌న్న‌బాబు పేర్కొన్నారు. గురువారం నియోజ‌క‌వ‌ర్గంలో చేప‌ట్టిన పాద‌యాత్ర‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.వైయ‌స్‌ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివ‌స్తున్నార‌ని చెప్పారు. స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభిస్తుంద‌న్నారు.  ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నార‌ని,  ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని వైయ‌స్ జ‌గ‌న్‌ భరోసానిస్తూ ముందుకు సాగుతున్నార‌ని చెప్పారు. సాయంత్రం ఆర్‌టీసీ కాంప్లెక్స్‌ వద్ద ప్రధానరహదారిపై ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌కు వేలాది జ‌నం స్వ‌చ్ఛందంగా త‌ర‌లిరానున్నార‌ని ఆయ‌న వెల్ల‌డించారు. 
Back to Top