ఇంకా కేంద్రంతో ఎందుకు కొనసాగుతున్నారు బాబూ?

కాకినాడ: చంద్రబాబు నాయుడు 29 సార్లు ఢిల్లీ వెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేనప్పుడు ఎందుకు ఇంకా కేంద్రంతో కొనసాగుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ప్రశ్నించారు. కాకినాడలో ప్రత్యేక హోదాపై ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో  కన్నబాబు పాల్గొని మాట్లాడారు. ఢిల్లీకి వెళ్లి చంద్రబాబు వంగి వంగి నమస్కారాలు చేసినా ఎందుకు కేంద్రం స్పందించలేదని, ఒక్క విభజన హామీనైనా సాధించారా అని నిలదీశారు. ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. హోదా సాధనకు వైయస్‌ఆర్‌సీపీ అలుపెరగని పోరాటం చేస్తుందని చెప్పారు.
 
Back to Top