వేల కిలోమీటర్ల పాదయాత్ర వైయస్‌ జగన్‌కే సాధ్యం తూర్పు గోదావరి: ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం ఒక్క వైయస్‌ జగన్‌కే సాధ్యమని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు కన్నబాబు పేర్కొన్నారు.  ఒక సామాన్యమైన నాయకుడికి ఇది సాధ్యం కాదన్నారు. పాదయాత్రలో వైయస్‌ జగన్‌ కొన్ని లక్షల మందిని కలిశారని, కొన్ని వేల సమస్యలు తెలుసుకున్నారన్నారు. కోనసీమలో పైనుంచి ఫోటో తీస్తే పాము మెలికలు తిరిగినట్లు జనసందోహం ఉందన్నారు. జన ప్రభంజనం వైయస్‌ జగన్‌ పట్ల ఉన్న అభిమానానికి నిదర్శమన్నారు. తూర్పు గోదావరి జిల్లా వాసులు జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఇన్ని వేల మందిని దగ్గరకు తీసుకొని మాట్లాడటం ఒక్క వైయస్‌ జగన్‌కే సాధ్యమన్నారు. ఈ పాదయాత్ర జీవితకాలంలో మరిచిపోలేని ఘటన అని పేర్కొన్నారు. 
 
Back to Top