వైయస్‌ఆర్‌ జయంతిన 2500ల మైలురాయి ఓ జ్ఞాపకం

తూర్పుగోదావరి: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి జయంతిన ఆయన తనయుడు చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 2500 కిలోమీటర్ల మైలురాయి పూర్తిచేసుకోవడం చరిత్రలో ఓ జ్ఞాపకంగా మిగిలిపోతుందని వైయస్‌ఆర్‌ సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా వలసపూడి వంతెన వద్ద వైయస్‌ జగన్‌ పాదయాత్ర 2500ల మార్కు దాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్న కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలతో మమేకమై దాదాపు 8 నెలల నుంచి రాష్ట్రంలో ఎండనకా.. వాననకా అలుపెరగకుండా తిరుగుతున్నారన్నారు. ఎక్కడకు వెళ్లినా ప్రజలు జననేత పాదయాత్రకు నీరాజనాలు పలుకుతున్నారన్నారు. 
Back to Top