జగనన్న నాయకత్వంలో మళ్లీ వైయస్‌ఆర్‌ సంక్షేమ రాజ్యం


విశాఖ జిల్లాః విశాఖపట్నం కంచరపాలెంలో రేపు సాయంత్రం జరగనున్న జననేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడానికి  సిద్ధంగా ఉన్నారని వైయస్‌ఆర్‌సీపీ నాయకురాలు వరుదు కల్యాణి అన్నారు.జగనన్నకు సంఘీభావం తెలియజేయడానికి ప్రజలంతా ఎదరుచూస్తున్నామన్నారు. గతంలో మహానేత దివంగత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి సంక్షేమరాజ్యాన్ని మళ్లీ జగనన్న సృష్టిస్తారనే నమ్మకంతో ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటారన్నారు. గత నెల 14 విశాఖ జిల్లాలో అడుగుపెట్టిన వైయస్‌ జగన్‌ అనకాపల్లి పరిధిలో ఏడు నియోజవర్గాల్లో పాదయాత్ర చేశారు. నర్సీపట్నం నుంచి సబ్బవరం వరుకు ఏడు బహిరంగ సభల్లో ప్రసంగించగా ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి వైయస్‌ జగన్‌కు మద్దతు తెలిపారు. 
Back to Top