దేవినేని.. బ్రోకర్ మంత్రి

  • దేవినేని నువ్వు బ్రోకరిజం చేసుకోవయ్యా...
  • వదినను చంపి రాజకీయాల్లోకి వచ్చిన నువ్వు వైయస్‌ జగన్‌పై మాట్లాడుతావా...
  • నీకు దమ్ము, ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రా.. 
  • పోలవరం సాధించిన ఘనత మహానేత వైయస్‌ఆర్‌ది
  • చంద్రబాబు వైయస్‌ఆర్‌ పాదాల దగ్గర నీరు నెత్తిన చల్లుకోవాలి
  • దేవినేని నీరు, నాలుక అదుపులో పెట్టుకో..
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌
విజయవాడ: ఇరిగేషన్‌ శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వర్‌రావు కమీషన్ల బ్రోకరని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ ధ్వజమెత్తారు.  పట్టిసీమ, పురుషోత్తపట్నంలో పెదబాబుకింతా.. చినబాబుకింతా.. నాకింతా.. అంటూ బ్రోకరిజం చేసే నువ్వు ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడుతావా అంటూ మండిపడ్డారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చనిపోయిన సమయంలో దేశమంతా దిగ్భ్రాంతికి గురైతే.. వైయస్‌ జగన్‌ పవర్‌ ప్లాంట్‌ గురించి ఆలోచించి టెండర్లు పిలవాలని కుట్ర పన్నాడనికి సిగ్గులేదా అని దేవినేనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ వైయస్‌ఆర్‌ సీపీ జిల్లా కార్యాలయంలో జోగి రమేష్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. దేవినేని ఉమా బు్రరకథలు చెప్పుకోవడానికి బాగా పనికొస్తాడని ఎద్దేవా చేశారు. ఇరిగేషన్‌ కంటే సొల్లు కబుర్ల శాఖామంత్రికి సరిపోతాడన్నారు. పోలవరం అనే మాట చంద్రబాబు, దేవినేని నోట్లో నుంచి వస్తే ప్రజలు విస్వసించరని, పోలవరం సాధించి తీసుకొచ్చిన ఘనత దివంగత నేత వైయస్‌ఆర్‌దన్నారు. 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా పోలవరం గురించి ఒక్క మాటైనా మాట్లాడారా.. అని నిలదీశారు. 

నీ నియోజకవర్గానికి గుక్కెడు మంచినీరు ఇవ్వని దద్దమ్మ మంత్రివి
దేవినేని ఉమకు దమ్మూ, ధైర్యం ఉంటే వైయస్‌ జగన్‌పై మాట్లాడిన మాటల మీద దమ్మూ, ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. నీ ఇరిగేషన్‌ ఆఫీకైనా, నీ ఇంటికైనా వస్తా మీడియా సమక్షంలో చర్చిద్దాం ఎప్పుడు రమ్మంటావో చెప్పు అని సవాలు విసిరారు. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ను పొన్నుపోటు పొడిచి పైకి పంపిస్తే, ఉమా సోదరుడు వెంకటరమణ దురదృష్టవశాత్తు మరణిస్తే అతని భార్య ఏ విధంగా రాజకీయాలకు వస్తుందోనని  అక్కసుతో వదినను చంపి రాజకీయాలకు వచ్చిన నువ్వు వైయస్‌ జగన్‌ను విమర్శిస్తావా అని నిప్పులు చెరిగారు. మహానేత వైయస్‌ఆర్‌ చనిపోతే 154 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి సోనియాగాంధీకి పంపించినా ముఖ్యమంత్రి పదవికి ఆశపడకుండా ప్రజల కోసం కాంగ్రెస్‌ పార్టీని వీడాడని గుర్తు చేశారు. ప్రజలతో ఓట్లు వేయించుకొని గెలవాలనే తపనతో రాజకీయాల్లో ఉన్నామని స్పష్టం చేశారు. మీ నాయకుడు చంద్రబాబులా వెన్నుపోటు రాజకీయాలు చేయలేదన్నారు. నియోజకవర్గ కేంద్రంలో తాగునీటి ఇబ్బందులు పడుతుంటే వారికి గుక్కెడు మంచినీరు ఇవ్వలేని దద్దమ్మ మంత్రి దేవినేని అని విరుచుకుపడ్డారు. 

చంద్రబాబు వైయస్‌ఆర్‌కు దండం పెట్టాలి
చంద్రబాబు కృష్ణా, గోదావరి నదులకు దండం పెట్టే ముందు మహానేత వైయస్‌ఆర్‌ ఫోటోకు దండం పెట్టాలని జోగి రమేష్‌ స్పష్టం చేశారు. నదులను అనుసంధానం చేసిన ఘనత వైయస్‌ఆర్‌దన్నారు. ఆయన తవ్విన పోలవరం కుడికాల్వ నుంచి నీరు పారుతున్నాయన్నారు. నంద్యాలకు వెళ్లి రోడ్లు వేయించా.. పెన్షన్లు ఇచ్చా అని చెబుతున్నావ్‌.. నీవు రాష్ట్రానికి చేసింది శూన్యం.. రోడ్లు, పెన్షన్లు ఇచ్చిన ఘనత వైయస్‌ఆర్‌దేనని గుర్తు చేశారు. వైయస్‌ఆర్‌ పాదాల చెంత నీటిని చంద్రబాబు నెత్తిన చల్లుకోవాలని, అప్పుడే కొన్ని పాపాలైనా పోతాయన్నారు. వైయస్‌ జగన్‌పై అభాండాలు వేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తేలేదని, దేవినేని నీ నోరు, నాలుక జాగ్రత్త పెట్టుకోవాలని హెచ్చరించారు. 

తాజా ఫోటోలు

Back to Top