<br/>విజయవాడ: ఏం తప్పు చేశామని ఈ రోజు తనను పోలీసు స్టేషన్‌కు పిలిచారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని వైయస్‌ఆర్‌సీపీ నేత జోగిరమేష్ ప్రశ్నించారు. టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదుతో జోగి రమేష్‌కు ఇటీవల పోలీసులు నోటీసులు పంపించారు. ఈ మేరకు మంగళవారం జోగి రమేష్ అరండల్‌పేట పోలీసు స్టేషన్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చంద్రబాబు మాదిరిగా వెన్నుపోటు పొడిచామా? తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టామా సమాధానం చెప్పాలన్నారు. తనకు ఇచ్చిన నోటీసులపై పోలీసులకు వివరించేందుకు వచ్చామన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలంతా కూడా ఏకతాటిపై ఉన్నారని, చంద్రబాబును ఇంటికి పంపించే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. జోగి రమేష్ వెంట పార్టీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు, పార్థసారధి, తదితరులు హాజరయ్యారు.