చంద్రబాబు చరిత్ర హీనుడు

హోదా కోసం రాజీనామాలు చేసిన ఎంపీలకు అభినందనలు
దేశ రాజకీయం వైయస్‌ఆర్‌ సీపీ వైపు చూస్తోంది
టీడీపీ ఎంపీలు ఆడ, మగ కాని వేషాలు వేయాలి
గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రరాష్ట్ర చరిత్రలో హీనుడిగా మిగిలిపోతాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌ ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామని ప్రకటిస్తే టీడీపీ నేతలు అవహేళన చేశారని ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లాలో జరుగుతున్న వంచనపై గర్జన దీక్షలో జోగి రమేష్‌ పాల్గొని మాట్లాడుతూ.. పదవి కోసం ముఖ్యమంత్రి పీఠం కోసం సొంత మామను చెప్పులతో కొట్టించిన చంద్రబాబు వెన్నుపోటు దారుడిగా మిగిలిపోతే.. హోదా కోసం పదవులను వదిలేసుకున్న వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు పంచపాండవులతో పోల్చితే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందన్నారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసిన ఎంపీలను అభినందించారు. దేశ రాజకీయాలన్నీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీవైపు చూస్తున్నాయన్నారు. టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేయకుండా దొడ్డిదారిన పారిపోయి అవిశ్వాసం పెట్టారన్నారు. వైయస్‌ఆర్‌ ట్రాప్‌లో చంద్రబాబు చిక్కుకున్నారని నరేంద్రమోడీ లోక్‌సభలో చెప్పారన్నారు. ప్రత్యేక హోదా సాధించే క్రమంలో ఎందాకైనా పోరాడుతారని ప్రధాని ఒప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీల వేషాలన్నీ అయిపోయాయని, వీరి వేషాలు చూసి రోత పుడుతుందని ప్రజలు విసుక్కుంటున్నారన్నారు. వేషాలన్నీ అయిపోయాయి.. ఇంకొకటి మిగిలి ఉందని, ఆడ, మగ వేషాలు తప్పించి ఇంకో వేషం వేయాలని ప్రజలంతా భావిస్తున్నారు. ఆడ కాదు.. మగ కాదు.. దద్దమ్మలు అని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రత్యేక హోదా వైయస్‌ జగన్‌తోనే సాధ్యమని, హోదా ఎజెండాతోనే ఎన్నికలకు వెళ్తామన్నారు. 175 స్థానాలకు 150 పైచిలుకు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 
Back to Top