గిరి శిఖరాల నుంచి జగనన్న కోసం..

విజయనగరంః వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కోసం గిరి శిఖర గ్రామాల నుంచి కూడా  గిరిజనులు పెద్దఎత్తున్న తరలివస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత జోగారావు అన్నారు. రాజన్న బిడ్డ వైయస్‌ జగన్‌ అంటే గిరిజనులకు అమితమైన ప్రేమ అని, జననేతపై హత్యాయత్నం జరిగిన తర్వాత ఆయన ఎలా ఉన్నారనే అభిమానంతో ప్రజలందరూ వేయికన్నులతో ఎదురుచూస్తున్నారన్నారు.వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఊపిరిగా ప్రజలు భావిస్తున్నారన్నారు.వైయస్‌ జగన్‌ను సీఎం చేయడమే ధ్యేయంగా ఆయన వెంట నడుస్తున్నారన్నారు. టీడీపీ పాలనలో  గిరిజనులు వంచనకు గురయ్యారన్నారు. దివంగత మహానేత వైయస్‌ఆర్‌ హయాంలో గిరిజనులు ఎంతో లబ్ధిపొందారని గుర్తు చేశారు.

తాజా ఫోటోలు

Back to Top