వైయస్సార్సీపీ నేత మృతి

విశాఖపట్నం: పలాస మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్సీపీ నేత జుత్తు జగన్నాయకులు శనివారం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన,  విశాఖలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. జగన్నాయకులు అంత్యక్రియలు స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లాలోని మందస మండలం హరిపురంలో జరగనున్నాయి. కొద్ది నెలల క్రితం ఆయన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకున్నారు. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించారు. జగన్నాయకులు 2009 నుంచి 2014 వరకు పలాస ఎమ్మెల్యేగా పని చేశారు. 
 
Back to Top