నాలుగేళ్ల నయవంచక పాలన ఇది

‘చంద్రబాబు నయవంచనలో నాలుగు సంవత్సరాలు పూర్తి అయ్యాయి.  బాబు పాలనకు కౌంట్ డౌన్ మొదలైందని ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం ఇన్ ఛార్జి వైవి రెడ్డి అన్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ బాబు తరచూ చెబుతూ ఉంటాడు.  మనవడితో ఆడుకునేందుకు సమయం లేకుండా పోయిందంటూ సన్నాయి నొక్కులు తున్నారనీ ఆయన విమర్శించారు. మరో పది నెలలు వెయిట్ చేస్తే చంద్రబాబుకు మిగిలిన పని అదేనంటూ ఎద్దెవా చేశారు. చంద్రబాబు నాయుడు పాలనకు నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో, ఐవి రెడ్డి స్పందిస్తూ... గడుస్తున్న ఒక్కో రోజూ చంద్రబాబు పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తం దిశగా తీసుకెళ్తోందని అన్నారు. 

‘చంద్రబాబును అంటే రాష్ట్ర ప్రజలకు ఎప్పుడూ ఏ మమకారమూ లేదు. మొదటగా వెన్నుపోటుతో ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత వాళ్లకాళ్లూ వీళ్ల కాళ్లు పట్టుకొంటూ  పొత్తులతో చంద్రబాబు రెండు సార్లు అధికారం సాధించుకున్నారని విమర్శించారు.
చంద్రబాబు అంతటి అవినీతి పరుడు, దళారీ, స్వార్థపరుడు,మరొకరు ఉండరన్నారు. 

ఈ నాలుగేళ్లలో రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా విషయంలో  డ్రామాలతో  చేసిన ద్రోహంతో ఆయన నయవంచన తేటతెల్లం అయ్యిందనీ,  ప్రజలు బాబును నమ్మే రోజులు పోయి చాలా కాలం అయ్యిందని మండిపడ్డారు.


Back to Top