ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తాం

కర్నూలు: రానున్న ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ నేత, రిటైర్డ్‌ ఐజీ మహమ్మద్‌ ఇక్బాల్‌ అన్నారు. బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీల సంక్షేమానికి కట్టుబడిన పార్టీ వైయస్‌ఆర్‌ సీపీ అన్నారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ సీపీ సెక్యులర్‌ పార్టీ అన్నారు. కొందరు కావాలనే ప్రతిపక్షంపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి సత్తా చాటుతామన్నారు. వైయస్‌ఆర్‌ సీపీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు. చంద్రబాబు పాలనలో రైతులు కూలీలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు గొప్పల వల్లే రాష్ట్రానికి నష్టం జరుగుతుందన్నారు. చంద్రబాబు అవినీతిపై కేంద్రం ఎందుకు స్పందించడం లేదన్నారు. 
Back to Top