చంద్రబాబు ముస్లింలను అవమానించాడు

ప్రశ్నిస్తే తీవ్రవాదులుగా చిత్రీకరించి తప్పుడు కేసులు 
వచ్చే ఎన్నికల్లో ముస్లింలంతా ఓటనే ఆయుధంతో బుద్ధి చెప్పాలి
గుంటూరు: ముస్లింలను అవమానపరిచే విధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ నాయకులు ఇక్బాల్‌ అన్నారు. మూడు దశాబ్దాల పైచిలుకు పోలీస్‌ ఆఫీసర్‌గా పనిచేసి రిటైర్డ్‌ అయ్యాను.. నా సర్వీస్‌లో ఇలా ఫ్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపిన వారిని వేధించడం ఇప్పుడే చూస్తున్నానన్నారు. చంద్రబాబు ముస్లింలతో నిర్వహించిన సభలో కొందరు యువకులు 2014లో ఇచ్చిన హామీలను ఫ్లకార్డులు ప్రదర్శించి వాటిని గుర్తు చేస్తే ముస్లింలపై చంద్రబాబుకు ప్రేమ ఉంటే వారిని వేదిక మీదకు పిలిచి ధన్యవాదాలు తెలిపి.. నా డ్యూటీ గుర్తు చేశారని అభినందించి.. హామీలు ఎందుకు అమలు చేయలేకపోయారో కారణాలు చెప్పాలన్నారు. కానీ అటువంటిది ఏదీ చేయకుండా ముస్లిం యువకులను తీవ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఫ్లకార్డులు పట్టుకొని సభలోనే నిరసన తెలుపుతుంటూ వారు పారిపోతుంటే పట్టుకున్నామని తప్పుల తడకగా కేసు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అక్రమంగా నిర్భందించిన వారిలో ఒక వికలాంగ యువకుడు కూడా ఉన్నాడన్నారు. ఏదైనా విధ్వంసకర ఘటన జరిగినప్పుడు మాత్రమే ఉపయోగించే సెక్షన్‌లను వారిపై ప్రయోగించి చిత్రహింసలకు గురిచేయడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. ముస్లింలను అవమాన పరిచే విధంగా ప్రవర్తిస్తున్న చంద్రబాబు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే టీడీపీ నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోతుందని హెచ్చరించారు. ముస్లింలంతా శాంతియుతంగా ఉండి వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో బలాన్ని చూపించి చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ముస్లింలు ఉద్యోగం, ఉపాధి, విద్య, ఆర్థికపరంగా అభివృద్ధి చెందుతారన్నారు. 
 
Back to Top