చంద్రబాబు వల్లే ముస్లింల వెనుకబాటు

నాలుగేళ్లలో ముస్లింలకు టీడీపీ చేసిందేమీ లేదు
ఇప్పటికీ మైనార్టీలు కూలీలుగా బతుకీడుస్తున్నారు
చంద్రబాబు ఎన్ని ఎత్తువేసిన ముస్లింలు నమ్మేస్థితిలో లేరు
ముస్లింలు అభివృద్ధి చెందారంటే అది వైయస్‌ఆర్‌ హయాంలోనే 
వైయస్‌ జగన్‌ కూడా ముస్లింల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు
విజయవాడ: చంద్రబాబు పాలనలో ముస్లింలు అన్ని రకాలుగా వెనకబడిపోయారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, రిటైర్డ్‌ ఐజీ మహ్మద్‌ ఇక్బాల్‌ అన్నారు. ముస్లింలకు చంద్రబాబు చేసిందేమీ లేదని ఆయన ధ్వజమెత్తారు. గుంటూరులో 28వ తేదీన ముస్లిం మైనార్టీల సభ నిర్వహించేందుకు ‘నారా హమారా.. టీడీపీ హమారా’ పేరుతో టీడీపీ నేతలు పోస్టర్‌ విడుదల చేశారన్నారు. రాష్ట్రంలోని ముస్లింలు మాత్రం ‘అయ్యా.. మేము వెన్నుపోటు, మోసం మళ్లీ మళ్లీ కోరుకోవడం లేదని, మా ఆకాంక్షలతో, మనోభావాలతో ప్రభుత్వం ఆడుకోవడాన్ని కోరుకోవడం లేదు’ అని అంటున్నారన్నారు. మీ రాజకీయ చదరంగంలో మమ్మల్ని పావులుగా, ఓటు బ్యాంక్‌గా వాడుకోవడాన్ని సమ్మతించమని ముస్లింలు ముక్తకంఠంతో చెబుతున్నారన్నారు. ఈ మేరకు విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఇక్బాల్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికీ ముస్లింలు కూలీలుగా బతుకులీడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

1999, 2004లో బీజేపీతో పొత్తుపెట్టుకున్న చంద్రబాబు తన రాజకీయ స్వార్థం కోసం ముస్లింలను మోసం చేశాడని ముస్లింలంతా మండిపడుతున్నారన్నారు. 2009లో బీజేపీతో జతకట్టి తప్పు చేశానని, లెంపలేసుకున్న చంద్రబాబు మళ్లీ 2014లో తిరిగి జతకట్టారన్నారు. నాలుగేళ్లు బీజేపీతో చంద్రబాబు బంధాన్ని కొనసాగించారన్నారు. ముజఫర్‌నగర్, గోవర్ధనపేట ముస్లింలపై దాడులు జరిగినా చంద్రబాబు స్పందించలేదన్నారు. ముస్లింల జీవితాలను రాజకీయంగా వాడుకున్నారు తప్ప ఎలాంటి మార్పులు తీసుకురాలేదని మండిపడ్డారు. సచర్‌ కమిటీ విద్యా, వైద్యం, ఆరోగ్యం, ఉపాధిలో ముస్లింలు వెనకబడి ఉన్నారని, అత్యంత దయనీయస్థితిలో ఉన్నారని చెప్పిందన్నారు. అయినా చంద్రబాబు పట్టించుకోకుండా తూతూ మంత్రంగా మసీద్‌లు, కబరస్తాన్‌లు రిపేర్లు చేస్తూ మోసం చేశారన్నారు. ఇప్పటికీ ముస్లింలు దినసరి కూలీలుగా బతుకులీడుస్తున్నారన్నారు.  

దేశంలో ముస్లిం మునిస్టర్‌ లేని ఏకైక ప్రభుత్వం చంద్రబాబుదేనని ఇక్బాల్‌ ధ్వజమెత్తారు. 2014లో ముస్లింలు టీడీపీకి ఓట్లు వేయలేదనే కోపంతో మంత్రిని కూడా నియమించలేదన్నారు. ముస్లింల వెనుకబాటుకు చంద్రబాబే కారణమన్నారు. ముస్లింలకు ఏదైనా మేలు జరిగిందంటే అది దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనేనని, వైయస్‌ఆర్‌ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్, ఫీజురియంబర్స్‌మెంట్‌ అందించి ఆదుకున్నారన్నారు. ఆయన తనయుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా క్లీయర్‌గా ముస్లింల అభివృద్ధికి పాటుపడతానని చెప్పారన్నారు. సెక్యులర్‌ విధానానికి కట్టుబడి ఉంటామని, విద్య, వైద్యం, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో అధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారన్నారు. కానీ చంద్రబాబు విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీతో వైయస్‌ఆర్‌సీపీకి ఎలాంటి పొత్తులు లేవని, ఒంటరిగానే వైయస్‌ జగన్‌ బరిలోకి దిగుతారన్నారు. టీడీపీ నయవంచనకు ముస్లిం సోదరులు బలికాకూడదని సూచించారు. 
Back to Top