వైయస్‌ఆర్‌సీపీ నేతల గృహ నిర్బంధం


అనంతపురం: వైయస్‌ఆర్‌సీపీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి, వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి రమేష్‌రెడ్డిలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. తిమ్మంపల్లిలోని ఆయన గృహం నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. గెర్డావ్‌ స్టీల్‌ ఫ్యాక్టరీ ప్రమాద ఘటనపై ఆందోళనకు సిద్ధమైన వీరిని పోలీసులు గృహ నిర్బంధం చేయడం పట్ల వైయస్‌ఆర్‌సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని వారు డిమాండు చేశారు.
 
Back to Top