రైతులకు న్యాయమైన పరిహారం అందించాలి


గుంటూరు: రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చి మోసపోయిన రైతులకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త హెనీ క్రిస్టినా అన్నారు. బోరుపాలెంలో రైతులు చేస్తున్న ఆమరణ దీక్షకు ఆమె మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా క్రిస్టినా మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి జరీబు భూములుగా తీసుకొని ఇప్పుడు మెట్టభూములనడం దారుణమన్నారు. రైతులకు అన్యాయం జరగకుండా జరీబు భూములకు ఇచ్చే ప్యాకేజీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాజధాని ప్రాంత రైతులకు న్యాయం జరిగే వరకు వారికి అండా వైయస్‌ఆర్‌ సీపీ పోరాడుతుందన్నారు. రైతులు తమకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని ఆమరణదీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. 
Back to Top