పేదల బతుకులకు భరోసా.. జగనన్న

 
 విశాఖ జిల్లాః జననేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నాయకత్వంలో మన బతుకులు బాగుపడతాయనే భరోసా ప్రజల్లో కలుగుతుందని వైయస్‌ఆర్‌సీసీ నేత గుడివాడ అమర్‌నాద్‌ అన్నారు. లక్షలాది ప్రజానీకగ్ ఫ్[న్'హ్ జగన్‌ అడుగుల్లో అడుగులేస్తూ సమస్యలు చెప్పుకుంటారన్నారు. స్థానిక సమస్యలపైన జననేత సానుకూలంగా స్పందిస్తున్న తీరు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ దఫా ఎన్ని ప్రలోభాలు ఎదురైనా జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలనే ధృడ సంకల్పంతో రాష్ట్ర ప్రజానీకం ఉందన్నారు. చంద్రబాబు మోసాలకు చరమగీతం పాడేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు నర్సీపట్నం, పాయకరావుపేట, యలమంచిలి, అనకాపల్లి, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభలకు వేలాదిగా అభిమాన జనం తరలిరావడం విశేషమన్నారు.  విశాఖ పట్టణ ప్రజానీకం జగనన్న రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారన్నారు. మంగళవారం మధ్యాహ్నం నగర శివారులోని పెందుర్తి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుందన్నారు. రేపు సబ్బవరంలో భారీ  బహిరంగ సభ ఏర్పాటు చేసిన‌ట్లు అమ‌ర్‌నాథ్ తెలిపారు.

Back to Top