పాదయాత్ర ప్రజల్లో భరోసా నింపుతోంది

అనకాపల్లిని జిల్లా చేస్తానని వైయస్‌ జగన్‌ ప్రకటన
సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌
విశాఖపట్నం: అనకాపల్లిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తానన్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ ప్రకటించడం స్థానిక ప్రజల్లో సంతోషాన్ని నింపిందని పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. అనకాపల్లిలో ప్రజా సంకల్పయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. జననేత పాదయాత్ర ప్రజానీకంలో భరోసా నింపుతుందన్నారు. 250వ రోజు ప్రజా సంకల్పయాత్ర అనకాపల్లి నియోజకవర్గంలో కొనసాగుతుంది. పాదయాత్రలో పాల్గొన్న గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ.. అనకాపల్లిని జిల్లాగా చేస్తే ప్రజలు ప్రతీ అవసరానికి విశాఖకు వెళ్లాల్సిన పనిలేదన్నారు. వైయస్‌ జగన్‌ దృష్టికి అనేక సమస్యలు తీసుకురావడానికి ప్రజలు బారులు తీరుతున్నారన్నారు. షుగర్‌ ఫ్యాక్టరీ సమస్యలు పరిష్కరిస్తానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారన్నారు. జననేత హామీలతో ప్రజలంతా సంతృప్తి చెందుతున్నారన్నారు. 
ప్రజలే కుటుంబంగా పాదయాత్ర: కల్యాణి
పుట్టినరోజు, పెళ్లిరోజు, పండుగ అన్ని ప్రజల మధ్యనే జరుపుకుంటూ ప్రజానాయకుడిగా వైయస్‌ జగన్‌ ముందుకుసాగుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు వరదు కల్యాణి అన్నారు. ప్రజలే తన కుటుంబంగా భావించి ప్రజలతో మమేకమువుతున్నారన్నారు. ఇడుపులపాయ నుంచి ప్రజా సంకల్పయాత్ర పేరిట పాదయాత్ర చేస్తూ అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు కదులుతున్నారన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలను పరిష్కరిస్తారిస్తారన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రజా ప్రస్థానం పేరుతో చేసిన పాదయాత్ర ద్వారా తెలుసుకున్న సమస్యలను ముఖ్యమంత్రి అయిన తరువాత పరిష్కరించారన్నారు. అదే విధంగా వైయస్‌ జగన్‌ కూడా సమస్యలు పరిష్కరిస్తారన్నారు. రాజన్న రాజ్యం వైయస్‌ జగన్‌తోనే సాధ్యమని ప్రజలంతా బలంగా నమ్ముతున్నారన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top