శ్రీకాకుళంః జిల్లాలో ప్రజా సంకల్పయాత్రలో దిగ్విజయంగా కొనసాగతుందని వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త గొర్లె కిరణ్ అన్నారు.టీడీపీ పాలనలో కష్టాలు పడుతున్న ప్రజలకు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఆశాజ్యోతిలా కనిపిస్తున్నారని. ఆయన వస్తే సంక్షేమ పథకాలు, అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారన్నారు.టీడీపీ నేతలు ఇంట్లో కూర్చోని విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు.ఎచ్చెర్ల నియోజకవర్గంలో అవినీతిమయంగా మారిందన్నారు.అభివృద్ధి,సంక్షేమ పథకాలు అమలు కాలేదన్నారు.పింఛన్లు,ఇళ్లు ఇస్తామని చెప్పి జన్మభూమి కమిటీల ద్వారా బ్రోకర్లను ఏర్పరచుకుని డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.వైయస్ జగన్ గురించి మాట్లాడే అర్హత కళా వెంకట్రావ్‌కు లేదన్నారు. ఎన్నికల సమయంలో అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్య పెట్టడం టీడీపీకి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు.నేడు మధ్యాహ్నం శ్రీకాకుళం జిల్లాలోకి ప్రజా సంకల్పయాత్ర ప్రవేశిస్తుందని తెలిపారు.