పగలు కాంగ్రెస్‌..రాత్రి బీజేపీతో బాబు సంసారం

విజయవాడ:  చంద్రబాబు పగలు కాంగ్రెస్‌తో, రాత్రి బీజేపీతో సంసారం చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు  విమర్శించారు. బీజేపీ, టీడీపీ నాలుగేళ్లుగా కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని, పార్లమెంట్‌ సాక్షిగా మరోసారి కుమ్మక్కు రాజకీయాలు బట్టబయలు అయ్యాయని పేర్కొన్నారు. చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమని, రాష్ట్ర ప్రయోజనాలు ఆయనకు పట్టడం లేదన్నారు. టీడీపీ ఎంపీలు రాత్రి పూట ఎంత మంది బీజేపీ నేతలనను కలుస్తున్నారని ఆయన ప్రశ్నించారు. 
 
Back to Top