మోసం, వెన్నుపోటు బాబుకు వెన్నతో పెట్టిన విద్య

ప్రకాశం: ఎంతటి వారినైనా మోసం చేయడం, వెన్నుపోటు పొడవడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత డాక్టర్‌ గరటయ్య విమర్శించారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్రలు చేస్తున్నాడని, హోదాపై బాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎన్డీయేతో ఇంకా ఎందుకు కొనసాగుతున్నారని ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో గరటయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. గతంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటన బాగుందని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు బాగులేదని చెప్పడం వెనుక ఉన్న ఆంతర్యమేంటని నిలదీశారు. ప్రజలకు ఇంకోసారి మోసం చేయడానికి చూస్తున్నారన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఎంపీలతో రాజీనామా చేయించాలని, లేదా వైయస్‌ఆర్‌ సీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. 
Back to Top