హజ్‌యాత్ర సబ్సిడీ ఎత్తివేతపై టీడీపీ మౌనమేందుకో?

వైయస్‌ఆర్‌ జిల్లా: కేంద్ర ప్రభుత్వం హజ్‌యాత్ర సబ్సిడీ ఎత్తివేస్తే ఎన్‌డీఏలో  భాగస్వామి అయిన తెలుగు దేశం పార్టీ ఎందుకు మౌనంగా ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు.  ఈ అంశంపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ఆయన నిలదీశారు. హజ్‌యాత్ర సబ్సిడీ కోసం వైయస్‌ఆర్‌సీపీ పోరాటం చేస్తుందని తెలిపారు. హజ్‌ యాత్రకు సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయడం సమంజసం కాదన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం కారణంగా అనేక మంది పేద ముస్లింలు మక్కాను దర్శించుకోలేరన్నారు. రాష్ట్రంలో మైనారిటీలపై దాడులు అధికమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మౌజన్‌ను హత్య చేయడం, గుంటూరు జిల్లాలో మైనారిటీలపై జరిగిన దాడిని తీవ్రంగా పరిగణించాల్సిన విషయమన్నారు. దాడి ఘటనపై కేసు నమోదు కాకపోవడం దురదృష్టకరమన్నారు.
 
Back to Top