మహానేతకు మరణం లేదు
అమెరికా: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డికి మరణం లేదని, సదాకాలం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైయస్‌ఆర్‌సీపీ నంద్యాల పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి పేర్కొన్నారు. అమెరికాలో నిర్వహించిన వైయస్‌ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అమెరికాలో ఇంత మంది తెలుగు వారి మధ్య మహానేత జయంతి వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. అవ్వతాతల ఆకు వక్కల్లో ఆ రోజు వైయస్‌ రాజశేఖరరెడ్డిని చూశామన్నారు. చిన్నపిల్లాడి గుండెకు చిల్లు పడితే ఉచితంగా ఆపరేషన్‌ చేయించి వారి గుండెల్లో నిలిచిపోయారన్నారు. రైతుల రుణమాఫీలో రాజన్నను చూశారన్నారు. గలగల నీరు పారేటప్పుడు, పుడమి తల్లి పులకించినప్పుడు మహానేతను చూశామన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, పావలావడ్డీ, రైతులకు ఉచిత విద్యుత్, 108, 104 వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి సామాన్యులకు అండగా నిలిచారని కొనియాడారు. 
 
Back to Top