మీరే అన్యాయం చేసి.. మీరే దీక్ష చేస్తారా?

విశాఖ‌: ఏపీకి ప్ర‌త్యేక హోదా రాకుండా చంద్ర‌బాబే అన్యాయం చేశార‌ని, ఇప్పుడు ఆయ‌నే దీక్ష చేస్తే ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని వైయ‌స్ఆర్‌సీపీ  సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. దొంగ దీక్షలతో మళ్లీ మోసం చేయడానికి చంద్రబాబు ముందుకొస్తున్నారని విమర్శించారు. విశాఖ దీక్ష‌లో ఆయ‌న మాట్లాడుతూ.. స్వప్రయోజనాల కోసమే చంద్రబాబు కేంద్రంతో లాలూచీ పడ్డారని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీని అద్భుతమంటూ.. దానిని చంద్రబాబు అంగీకరించారని, ప్రజల్లో వ్యతిరేకతను చూసి మళ్లీ ఆయన యూటర్న్‌ తీసుకున్నారని ధర్మాన గుర్తుచేశారు.  చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేశారని, ఇప్పుడు తనను ప్రజలే కాపాడాలని చంద్రబాబు వేడుకోవడం సమంజసమా అని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబుకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ఆయన అభ్యర్థించారు.

Back to Top