మోసకారి చంద్రబాబును ప్రజలు క్షమించరు

శ్రీకాకుళం: ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రరాష్ట్ర ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబును ఎవరూ క్షమించరని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో బంద్‌ సంపూర్ణంగా కొనసాగుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారన్నారు. కేంద్రం ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. విభజనతో అన్యాయానికి గురైన ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా అనే అంశాన్ని చంద్రబాబు సాధించుకున్నది కాదని, 70 సంవత్సరాల అనంతరం విడిపోయిన తెలుగు ప్రజలు ఏకకాలం ఉద్యమిస్తే వచ్చిన హక్కు అన్నారు. చంద్రబాబు దొంగచాటుగా అతని ప్రయోజనాల కోసం.. అవసరాల కోసం మోదాను తాకట్టుపెట్టి మాయమాటలతో తెరమీదకు వస్తే ప్రజల క్షమించరన్నారు.  
Back to Top