రోడ్డు ప్రమాదంలో వైయస్‌ఆర్‌సీపీ నేత మృతి

అనంతపురం: గుంతకల్లు –మద్దికెర రహదారిపై మద్దికెర గ్రామ సమీపంలోని వేర్‌హౌస్‌ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా, మద్దికెర మండలం వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు వెంకట్రాముడు(58) మృతిచెందగా, అతడి కుమారుడు రాజగోపాల్‌ తీవ్రంగా గాయపడ్డాడు. మద్దికెర గ్రామానికి చెందిన వెంకట్రాముడు గత కొన్ని సంవత్సరాలుగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో క్రియశీల నాయకుడిగా కొనసాగుతున్నారు. పార్టీ రైతు సంఘం మండలాధ్యక్షుడిగా రైతుల సమస్యలపై పోరాడుతున్నారు. వెంకట్రాముడు కుమారుడు రాజగోపాల్‌ గత 15 సంవత్సరాల క్రితం గుంతకల్లుకు వచ్చి ఎనుములు, పాల వ్యాపారం చేస్తూ ఇక్కడే స్థిరపడ్డాడు. ఈ క్రమంలో తరచూ గుంతకల్లులోని కుమారుడి వద్దకు వచ్చి వెళ్తున్న వెంకట్రాముడు మంగళవారం ఉదయం కుమారుడు రాజగోపాల్‌ తో కలిసి ద్విచక్ర వాహనంపై మద్దికెరకు బయలుదేరాడు. మార్గ మధ్యంలో మద్దికెర సమీపంలోని వేర్‌హౌస్‌ సమీపంలో వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదపుతప్పిబోల్తా కొట్టింది.  విషయం తెలుసుకున్న వైయస్‌ఆర్‌సీపీ మండల కన్వీనర్‌ మురళీధర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ మల్లికార్జున, తదితర నాయకులు గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని మృతదేహాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. 
Back to Top