అచ్చం వైయస్‌ఆర్‌లా పాలన చేస్తాడు

రాక్షసపాలన అంతమొందించేందుకు పాదయాత్ర
రాజన్న బిడ్డతోనే సంక్షేమమని ప్రజలు విశ్వసిస్తున్నారు
2500ల కిలోమీటర్లకు ఏర్పాటు పూర్తి
తూర్పుగోదావరి: తెలుగుదేశం పార్టీ రాక్షస పాలనను అంతమొందించేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేపట్టారని వైయస్‌ఆర్‌ సీపీ రామచంద్రాపురం కోఆర్డినేటర్‌  చెల్లుబోయిన వేణుగోపాలకష్ణ అన్నారు. పూర్వం మునులు రాక్షసుల బారి నుంచి ప్రజలను కాపాడేందుకు తపస్సు చేశారని, ప్రస్తుత దుర్మార్గపు పాలనను అంతం చేసేందుకు వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్ర చేపట్టారన్నారు. రామచంద్రాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారన్నారు. రాజన్న బిడ్డ వచ్చాడు.. మన కష్టాలు తీరుస్తాడని ప్రజలు పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారని, కష్టాలు తీరాలంటే వైయస్‌ జగన్‌తోనే సాధ్యమని విశ్వసిస్తున్నారన్నారు. 

మహిళాభివద్ధి కోసం అనేక పథకాలను ప్రకటించిన జననేతకు అక్కచెల్లెమ్మలు హారతులు పడుతున్నారని చెల్లుబోయిన వేణుగోపాలకష్ణ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి బడుగు, బలహీనవర్గాలు, ముస్లిం మైనార్టీలకు అండగా పరిపాలన చేశారని, అదే రీతిలో వైయస్‌ జగన్‌ పాలన చేస్తారన్నారు. వైయస్‌ఆర్‌ ఆశయ సాధన కోసం కతనిశ్చయంతో ముందుకు సాగుతున్నారన్నారు. రేపటితో పాదయాత్ర 2500 కిలోమీటర్లు పూర్తి చేసుకోనుందని, ఇందుకు అన్ని ఏర్పాటు చేశామన్నారు. 2500 కిలోమీటర్ల ఘట్టం రామచంద్రాపురంలో పూర్తవ్వడం సంతోషంగా ఉందన్నారు. 

 

తాజా ఫోటోలు

Back to Top