దోచుకోవడం..దాచుకోవడమేనా...ప్రజా సమస్యలు పట్టవా..!


–వైయస్‌ఆర్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ
విజ‌య‌న‌గ‌రం:  టీడీపీ నాయ‌కుల‌కు దోచుకోవ‌డం..దాచుకోవ‌డం త‌ప్ప ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌ట్ట‌డం లేద‌ని వైయ‌స్ఆర్ సీపీ సీనియ‌ర్ నాయ‌కులు బొత్స స‌త్య‌నారాయ‌ణ మండిప‌డ్డారు. విజయనగరం జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నా ప్రభుత్వానికి పట్టడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాలనకు,చంద్రబాబు పాలనకు సంబంధమే లేదని, వైయస్ఆర్‌  పాలన ప్రజాపాలన అని, చంద్రబాబుది అవినీతి పాలనగా బొత్స అభివర్ణించారు.  తక్షణం జిల్లాలో హెల్త్‌ ఎమర్జెనీ ప్రకటించాలని ఆయ‌న డిమాండు చేశారు.
Back to Top