బీసీ సంఘాలన్నీ ఒకే గొడుగు కిందకు రావాలిగుంటూరు : బీసీ సంఘాలన్నీ కూడా ఒకే గొడుగు కిందకు రావాలని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. గుంటూరులో నేషనల్‌ ఓబీసీ ఫెడరేషన్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు బీసీలకు అనేక హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక బీసీలకు ఆయన చేసిందేమీ లేదని ఆయన మండిపడ్డారు. నాయీ బ్రాహ్మణులను చంద్రబాబు ఇటీవల బెదిరించారని గుర్తు చేశారు.  బీసీలకు చట్టభద్రత కల్పించాలని ఆయన డిమాండు చేశారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక బీసీ డిక్లరేషన్‌ ప్రకటించి తోడుగా ఉంటామని చెప్పారు. 
 
Back to Top