పార్లమెంట్‌ సాక్షిగా చంద్రబాబు గుట్టురట్టు

ప్రత్యేక హోదా మోసానికి ఆజ్యం పోసింది బాబే
టీడీపీ, బీజేపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధం
వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ
అమరావతి: పార్లమెంట్‌ సాక్షిగా చంద్రబాబు వంచన రాజకీయాల గుట్టు ప్రధాని మోడీ బట్టబయలు చేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రాన్ని అడ్డంగా మ ఓసం చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆంధ్రరాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించరన్నారు. నిన్నటి రోజు లోక్‌సభ నుంచి మంచి వార్త వినాలను ఎదురుచూసిన రాష్ట్ర ప్రజానీకానికి మరోసారి వంచన ఎదురైందన్నారు. బీజేపీ, టీడీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు రాష్ట్రం తాలూకా అభివృద్ధి కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని, హోదా వద్దు ప్యాకేజీ ఇవ్వాలని కోరారని మోడీ పార్లమెంట్‌ సాక్షిగా చెప్పారన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేస్తే దానికి ఆజ్యం పోసింది చంద్రబాబేనని మోడీ ప్రసంగం విన్న ప్రతిపౌరుడు ఆగ్రహంతో ఉన్నారన్నారు. 
 
Back to Top