పోలవరంపై ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి కరువు


బొత్స సత్యనారాయణ
హైదరాబాద్‌: పోలవరాన్ని వదిలేసి పట్టిసీమకు ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. ఈ నాలుగేళ్లలో బడ్జెట్‌ కేటాయింపులు నామమాత్రంగా ఉన్నాయన్నారు. కేంద్రంలో బీజేపీకి, టీడీపీ నేతలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కేంద్రం నిర్మించాల్సిన పోలవరాన్ని చంద్రబాబు తన స్వార్థం కోసం తీసుకున్నారని మండిపడ్డారు. డీపీఆర్‌లో ఎందుకు వ్యత్యాసాలు వచ్చాయని ఆయన నిలదీశారు. భూసేకరణ ఎందుకు పెరిగిందని, నిర్మాణ వ్యయం ఎందుకు పెరిగిందని కేంద్ర మంత్రి ఇవాళ కొత్తగా ప్రశ్నించడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. పోలవరాన్ని నిర్మించే చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు.
 
Back to Top