సంక్షేమానికి మారుపేరు వైయస్‌ఆర్‌

వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైయస్‌ఆర్‌ జయంతి
కష్టం వస్తే మన ముఖ్యమంత్రి ఉన్నారనే ధైర్యం కల్పించారు
ఉచిత విద్యుత్‌కు శ్రీకారం చుట్టిన మహానుభావుడు
రాజన్న రాజ్యం రావాలంటే వైయస్‌ జగన్‌తోనే సాధ్యం
మహానేత ఆశయాలే సిద్ధాంతాలుగా పుట్టిన పార్టీ వైయస్‌ఆర్‌ సీపీ
హైదరాబాద్‌: సంక్షేమానికి మారుపేరుగా దేశంలోనే పేరొందిన నాయకుడు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో దివంగత మహానేత వైయస్‌ఆర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, పుత్తా ప్రతాప్‌రెడ్డి, విజయచందర్, ప్రపుల్లారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డిలు భారీ కేక్‌కట్‌ చేసి కార్యకర్తలకు పంచారు. అనంతరం పేదమహిళలకు చీరలు పంచారు. జయంతి సందర్భంగా లోటస్‌పాండ్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు.

ఏదైనా పథకం ప్రారంభిస్తే అది చిరస్థాయిలో నిలిచే విధంగా వైయస్‌ఆర్‌ ఆలోచన విధానం ఉంటుందని బొత్స సత్యనారాయణ అన్నారు. మహానేత హయాంలో చేపట్టిన పథకాలు ఆయన మరణించాల్సిన తరువాత కూడా కొనసాగిస్తున్నాయన్నారు. దేశంలో వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ రైతుల కళ్లలో సంతోషం చూసిన వ్యక్తి వైయస్‌ఆర్‌ అని కొనియాడారు. ఉచిత విద్యుత్‌కు శ్రీకారం చుట్టిన ఘనత వైయస్‌ఆర్‌దే అన్నారు. ఉచిత విద్యుత్‌ రైతులకు ఇచ్చిన మహాప్రసాదమన్నారు. ఏనాడూ పేదవాడు ఇబ్బంది పడకుండా.. నాకు మా ముఖ్యమంత్రి వైయస్‌ఆర్‌ ఉన్నారు. ఆయన తీరుస్తాడనే భరోసాను కల్పించారన్నారు. పేదవాడు కష్టాలు మర్చిపోయి హాయిగా నిద్రపోయే రోజులు మళ్లీ రావాలంటే అది వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌తోనే సాధ్యమన్నారు.  

తండ్రి ఆశయసాధన కోసం.. వైయస్‌ఆర్‌ ఆశయాలే సిద్ధంతాలుగా పార్టీని స్థాపించిన ప్రజల క్షేమం కోసం పోరాడుతున్న నాయకుడు వైయస్‌ జగన్‌ అని బొత్స అన్నారు. మళ్లీ మహానేత రామరాజ్యం తీసుకురావాలని పాదయాత్ర చేస్తున్నారని, పాదయాత్రకు ప్రజలు చూపుతున్న అభిమానం అంతా ఇంతా కాదన్నారు. నాన్నగారి ఆశయాలను నెరవేర్చాలని సుదీర్ఘ పాదయాత్ర చేస్తూ రాబోయే ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వండి రాజన్న రాజ్యం తీసుకొస్తానని కోరుతున్నారన్నారు. వైయస్‌ఆర్‌ ఆశయాలు వైయస్‌ జగన్‌తోనే సాధ్యమవుతాయని, తద్వారా ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రతీ కార్యకర్త ప్రతినపూనాలని కోరారు. 
Back to Top