బాబు పాలనను గాలికొదిలేశారు–వైయస్‌ఆర్‌సీపీ గుంటూరు జిల్లా యువజనవిభాగం అధ్యక్షుడిగా బూరెల దుర్గాప్రసాద్‌
గుంటూరు: చంద్రబాబు పాలనను గాలికొదిలేశారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. గుంటూరు పార్లమెంట్‌  జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా బూరెల దుర్గప్రసాద్‌ ప్రమాణ స్వీకారం కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ. లేళ్ల అప్పిరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా తదితరులు పాల్గొని ప్రసంగించారు. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. జేసీ దివాకర్‌రెడ్డి గతాన్ని మరిచిపోయి మాట్లాడుతున్నారని, ఎవరిని మెప్పించడానికి ఇలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.  వయసు పెరిగితే సరిపోదని, బుద్ధి పెరగాలని జేసీ దివాకర్‌రెడ్డికి చురకలంటించారు. అధికారం ఉందని అహంకారంతో మాట్లాడితే ప్రజలు క్షమించరన్నారు. రాజకీయాల్లో హుందా తనం ముఖ్యమన్నారు. చంద్రబాబు పాలనలో అవినీతి ఆకాశాన్ని అంటుతుందని మండిపడ్డారు.  చంద్రబాబు అసమర్థ ముఖ్యమంత్రి అని అనేకసార్లు రుజువైందన్నారు. గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోతే ఎలాంటి చర్యలు లేవన్నారు. చంద్రబాబు పరిపాలనను గాలికొదిలేశారని మండిపడ్డారు. కలెక్టర్లు కూడా టీడీపీ అవినీతిలో భాగస్వాములయ్యారని విమర్శించారు. ఇసుక, మట్టిని దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ అవినీతిని ఎండగట్టాల్సిన బాధ్యత వయస్‌ఆర్‌సీపీ శ్రేణులపై ఉందన్నారు. వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా సాగుతుందని, రాజన్న రాజ్యాన్ని తెచ్చుకునే పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 
 
Back to Top