టీడీపీ ఎమ్మెల్యే ఆంజనేయులు చరిత్ర అందరికీ తెలుసు

గుంటూరు: వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే ఆంజనేయులు చరిత్ర అందరికీ తెలుసు అని బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. ఎమ్మెల్యే ఆంజనేయులు స్మగ్లింగ్‌ చేసి డబ్బులు సంపాదిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత బొల్లా బ్రహ్మనందనాయుడు విమర్శించారు. హత్యా రాజకీయాలు, శవ రాజకీయాలు చేసే చరిత్ర ఆంజనేయులుదే అన్నారు. వ్యాపారంలో తన పార్టనర్‌నే హత్య చేయించిన వ్యక్తి ఆంజనేయులు అన్నారు. పార్టనర్‌ భార్యను కూడా బెదిరించి వాళ్ల ఆస్తులను ఆంజనేయులు బలవంతంగా లాక్కున్నారని విమర్శించారు. వేల కోట్లు ఎలా సంపాదించారో సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. తనపై హత్య కేసు బనాయించడానికి పోలీసులపై ఆంజనేయులు ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. పోలీసులు పక్షపాతం లేకుండా విచారణ చేస్తే వాస్తవాలు వెల్లడవుతాయని చెప్పారు. ఆంజనేయులు ముగ్గురిని చంపించినట్లు వినుకొండలో ప్రచారం జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వినుకొండలో వైయస్‌ఆర్‌సీపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

 
Back to Top