వెంకన్నసాక్షిగా బాబు హామీ ఇచ్చి గాలికి


 తిరుపతి:  చంద్ర‌బాబు 2014 ఎన్నిక‌ల‌కు ముందు తిరుప‌తి వెంక‌న్న సాక్షిగా ఇచ్చిన హామీల‌ను గాలికి వ‌దిలేశార‌ని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి విమ‌ర్శించారు. చంద్రబాబు నాయుడు ప్రజా ద్రోహి అని ఆయ‌న మండిప‌డ్డారు. తిరుపతి నగరంలోని ఎయిర్‌ బైపాస్‌ రోడ్డులో చంద్రబాబు పాలనపై వైయ‌స్ఆర్‌సీపీ నేతలు భూమన కరుణాకర్‌ రెడ్డి, పార్టీ సంయుక్త కార్యదర్శి ఎస్‌కే బాబు, నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌ రెడ్డి తదితరులు కలసి ప్రజా బ్యాలెట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన విలేకరులతో మాట్లాడుతూ.. 2014 ఎన్నికల సమయంలో 600 హామీలు ఇచ్చి..ఒక్క హామీ కూడా సరిగా అమలు చేయని వ్యక్తి చంద్రబాబు అని తీవ్రంగా ధ్వజమెత్తారు. డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తానని తిరుపతిలో హామీ ఇచ్చి గాలికి వదిలేశాడని మండిపడ్డారు. చంద్రబాబు మాటలు నమ్మి డ్వాక్రా మహిళలు తీవ్రంగా మోసపోయారని వ్యాఖ్యానించారు. నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని మాట త‌ప్పారన్నారు. చంద్ర‌బాబు పాలనపట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది..ఇందుకు నిదర్శనం తిరుపతిలో ఈ రోజు నిర్వహించిన ప్రజాబ్యాలెట్‌కు లభించిన స్పందనేనని వ్యాక్యానించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు గుణ‌పాఠం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు.


తాజా ఫోటోలు

Back to Top