సుధాకర్‌ ఆత్మహత్య.. చంద్రబాబు చేయించిన హత్య

తిరుపతి: ప్రత్యేక హోదా కోసం మదనపల్లెలో సుధాకర్‌ చేసుకుంది ఆత్మహత్య కాదని.. చంద్రబాబు చేయించిన హత్య అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. పోరాటం ద్వారానే హోదా సాధ్యమవుతుందని, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు. ఆత్మహత్యలు సరైన విధానం కాదు.. ప్రభుత్వం ఎంత మొండి వైఖరికి సుధాకర్‌ మరణం నిదర్శనమన్నారు. అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయన్నారు. హోదా వస్తే లాభాలేంటో చెప్పి.. అధికారం గద్దెనెక్కిన తరువాత హోదా అవసరమే లేదని విషప్రచారం చేస్తున్నారు. నాలుగేళ్లుగా వైయస్‌ జగన్‌ పోరాటం వలన హోదా నినాదం ఇంకా బతికి ఉందన్నారు. చంద్రబాబు చేసిన ద్రోహానికి గతంలో మునికోటి.. నేడు నిరుపేద చేనేత కార్మికుడు సుధాకర్‌ బలిదానమయ్యారన్నారు. ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తి చంద్రబాబు తప్ప మరొకరు కాదన్నారు. 
 

తాజా ఫోటోలు

Back to Top