మాట త‌ప్పే అల‌వాటు వైయ‌స్ కుటుంబంలో లేదు

 

తిరుపతి:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుటుంబం మాట ఇస్తే త‌ప్ప‌ద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి పేర్కొన్నారు.  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితేనే ఆటో కార్మికుల జీవితాలు బాగుపడతాయని పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. తిరుపతిలో ఆటో కార్మికుల సమావేశానికి భూమన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. ప్రతి ఆటో కార్మికుడికి రూ. 10 వేలు ఇస్తామని ఇప్పటికే చెప్పారన్నారు. ఇచ్చిన మాట తప్పే అలవాటు వైయస్‌ కుటుంబంలో లేదు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో ఆటో కార్మికులు ఏనాడూ ఇబ్బందులు పడలేదు. చంద్రబాబు పాలనలో ఆటో కార్మికులను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. 

 
Back to Top