వైయస్‌ జగన్‌ గెలుపును ఎవరూ ఆపలేరు

ప్రకాశం: బూత్‌ కమిటీలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి సూచించారు. ప్రకాశం జిల్లాలో నిర్వహించిన బూత్‌ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మొదట్లో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిని కాంగ్రెస్‌ పార్టీ మొదట్లో క్షోభ పెట్టిందని, కానీ ముఖ్యమంత్రి కాకుండా ఆపలేకపోయిందన్నారు. అదే విధంగా వైయస్‌ జగన్‌ను కూడా చెప్పుచేతల్లో పెట్టుకోవాలని ప్రయత్నించిందన్నారు. కానీ జననేత కెరటంలా లేచి ఇవాళ ప్రజల మన్నలను పొందుతున్నారన్నారు. పార్టీ స్థాపితం నుంచి ప్రజల పక్షాన నిలబడి వైయస్‌ జగన్‌ అనేక పోరాటాలు, దీక్షలు చేశారన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. 
Back to Top