అది దగా కోరు దీక్ష

తిరుపతి: ఈ నెల 30న సీఎం చంద్రబాబు తిరుపతిలో తలపెట్టిన దీక్ష దగా కోరు దీక్ష అని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. తిరుపతిలోని గాంధీ విగ్రహం ఎదుట భూమన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నినదించారు. ఈ నెల 20న చంద్రబాబు చేసింది దొంగ దీక్ష అన్నారు. నాలుగేళ్లుగా హోదాపై చంద్రబాబుకు ఎందుకు మౌనంగా ఉన్నారని, ఇప్పుడేందుకు దొంగదీక్షలు చేస్తున్నారని భూమన కరుణాకర్‌రెడ్డి ప్రశ్నించారు. కేసుల భయంతోనే హోదాపై చంద్రబాబు మాట్లాడలేదని విమర్శించారు. వైయస్‌ జగన్‌ పోరాటం వల్లే హోదాపై ప్రజల్లో ఆదరణ లభించిందన్నారు.అందుకే చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారని ధ్వజమెత్తారు. తిరుపతిలో తలపెట్టిన సభ దగా కోరు సభ అని భూమన అభివర్ణించారు.
 
Back to Top