నిత్యపోరాటం.. ప్రజా సంక్షేమమే లక్ష్యం

ఏడేళ్ల ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు
అభివృద్ధి, సంక్షేమం వైయస్‌ఆర్‌ సీపీకి రెండు కళ్లు
మహానేత ఆశయ సాధన కోసం పార్టీ ఆవిర్భావం
ప్రజా సంక్షేమం కోసం పోరాడే నాయకుడు వైయస్‌ జగన్‌
వైయస్‌ జగన్‌ నాయకత్వ పటిమతో పార్టీ మహా వటవృక్షమైంది
ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది
జననేత నాయకత్వ పటిమతో తిరుగులేని పార్టీగా మారింది
బలమైన ప్రతిపక్షనేతగా అన్యాయాలను ఎదుర్కొంటున్న వైయస్‌ జగన్‌
టీడీపీ దాష్టీకాన్ని తిప్పికొడుతూ నిత్యపోరాటం
అమరులైన పార్టీ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
హైదరాబాద్‌: మహానేత దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను సాధించేందుకు, ప్రజల జీవితాల్లో సంతోషాన్ని చిగురింపజేసేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించిందని పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఏడు సంవత్సరాల కాలంలో మహా వటవృక్షంగా ఆధరాభిమానాలు చురగొంటుందన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భూమన కరుణాకర్‌రెడ్డి హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ చేస్తున్న పోరాటాలు, ప్రజాభిమానం గురించి ఆయన ఏం మాట్లాడారో... ఆయన మాటల్లోనే...  

అనేక రకాల కష్టాలు, నష్టాలు ఎదుర్కొంటూ ప్రజల పక్షాన నిలిచి ప్రజల కోసం పోరాడుతూ ప్రభుత్వాల దాష్టీ్టకాలకు ఎదురులేకుండా పోయిన ప్రభుత్వ మోసాలకు దీటుగా సమాధానం వైయస్‌ఆర్‌ సీపీ సమాధానం ఇస్తుంది. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వీరోచితమైన పోరాటాలు చేస్తూ ప్రజల పార్టీగా జనం మనసుల్లో స్థానం ఏర్పరుచుకుంది. ఆనాడు కాంగ్రెస్‌ పార్టీ.. చంద్రబాబుతో కమ్ముకై దివంగత మహానేత వైయస్‌ఆర్‌ ఆశయాలను సమాధి కట్టాలని చూస్తుంటే.. వైయస్‌ఆర్‌ ఆశయాలను బతికించాలనే ఊతక్రరగా సమ్మున్నత విలువలతో కూడిన పార్టీగా ఆవిర్భవించింది. చంద్రబాబు తన సొంత మామను వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కుని టీడీపీ చంద్రబాబు తెలుగుదేశం పార్టీగా ఆవిర్భవిస్తే.. వైయస్‌ఆర్‌ సీపీ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను కాంగ్రెస్‌ తుదముట్టించేందుకు కంకణం కట్టుకుంటే దాన్ని ఎదురొడ్డి నిలిచి కాంగ్రెస్‌కు చరమగీతం పాడింది. 
వైయస్‌ జగన్‌ ఉన్నతమైన వ్యక్తిత్వంతోనే...
సమున్నత విలువలతో ఎనలేని ధైర్య సాహసాలతో, తను నమ్మిన సిద్ధాంతంతో, ఉన్నతమైన వ్యక్తిత్వంతో  ప్రజల మనస్సులో అనునిత్యం దొర్లుతూ వైయస్‌ జగన్‌ పార్టీని నిత్య నూతన చిరంజీవిలా నిలబెడుతూ వచ్చారు. వైయస్‌ఆర్‌ సీపీ ధృడ చిత్తం కలిగిన నాయకుడి నాయకత్వంలో నడుస్తుంది. తప్పుడు హామీలు ఇవ్వకుండా , ఏరకమైన సినీ గ్లామర్‌ లేకుండా 2014 ఎన్నికల్లో 67 స్థానాలు గెలుచుకుంది. తన నాయకత్వ పోరాట నైజంతో వైయస్‌ జగన్‌ ప్రజలకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పించారు. ఉద్యమాల పార్టీగా గుర్తింపు తెచ్చుకున్నారు. దేశ రాజకీయాల్లో కొన్ని వందల పార్టీలు పుట్టి కనబడకుండా పోయాయని, కానీ ఒక ప్రాంతీయ పార్టీ ఏ రకమైన సపోర్టు లేకపోయినా వైయస్‌ జగన్‌ నాయకత్వ ప్రతిభ కారణంగా వైయస్‌ఆర్‌ సీపీ నిరంతరం ప్రజల నాలుకల్లో తిరుగుతుంది. 
అంతిమంగా న్యాయమే గెలుస్తుంది...
పాండవులను కౌరవులు అనేక ఇబ్బందులకు గురి చేసినా చివరకు కౌరవులు ఓడిపోయారు. అంతిమంగా పాండువులు గెలిచి న్యాయాన్ని నిలబెట్టారు. అలాగే ప్రజల ఆకాంక్షల కోసం ఎన్నో ఉద్యమాలు చేస్తున్న వైయస్‌ఆర్‌ సీపీకి కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్ముతున్నాం. ప్రజలను మోసం చేయాలనే నీచపు  ఆలోచన కలిగిన చంద్రబాబు గెలుపు తాత్కాలికమే. వైయస్‌ఆర్‌ ప్రజల అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పనిచేశారు. వాటిని నిరంతరం కొనసాగించాలని వైయస్‌ఆర్‌ సీపీ పనిచేస్తుంది. ఏడేళ్లుగా ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొన్న వైయస్‌ఆర్‌ సీపీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. తెలుగుదేశం పార్టీ దాష్టీకానికి ప్రాణాలు కోల్పోయిన నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు పార్టీ ప్రగాఢ సానుభూతి తెలుపుతుంది. వారి ఆశయాలకు అనుగూనంగా పార్టీ నడుస్తుంది. 
పచ్చమీడియాతో బాబు తప్పుడు ప్రచారం...
వైయస్‌ఆర్‌ ఆశయాలను బతికించడం కోసం ప్రత్యర్థులు ఎన్ని కష్టాలు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రజల ఆకాంక్షలను వమ్ము చేయకుండా ఆశయాలను కొనసాగించడానికి పార్టీ పునరంకితం అవుతుంది. నాలుగేళ్ల టీడీపీ పాలనలో 600ల వాగ్దానాలు ఇచ్చి ఒక్కటి నెరవేర్చకుండా తన పచ్చ మిత్రుల ప్రసార మధ్యమాలతో చంద్రబాబు నిరంతరం పొగిడించుకుంటున్నారు. బాబు మోసాలను నిరంతరం ఎండగడుతూ.. వైయస్‌ జగన్‌ పోరాట యోధుడిగా ప్రజల మన్నలను పొందారు. వైయస్‌ఆర్‌ సీపీపై నిరంతరం బుదరజల్లుతూ పార్టీ హననాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ఎన్నో కుట్రలు చేస్తున్నాడు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం తప్ప.. ప్రజల ఆకాంక్ష అనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరించాడు. 
బాబు ఆగడాలకు వైయస్‌ జగన్‌ అడ్డు...
వైయస్‌ జగన్‌ లాంటి ప్రధాన ప్రతిపక్షనేత ఉండడం కారణంగానే బాబు ఆగడాలు కట్టడి అయ్యాయి. లేకపోతే ఇంకా దారుణమైన పాలన సాగించేవాడు. అధికారంలోకి వస్తే 15 సంవత్సరాలు హోదా సాధిస్తామని, అధికారంలోకి వచ్చిన తరువాత హోదా అవసరం లేదని తన అనుకూల మీడియాతో ప్రచారం చేయిస్తున్నాడు. ప్రతిపక్ష స్థానంలో కూర్చుని ప్రజలకు తనకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తున్న వ్యక్తి వైయస్‌ జగన్‌. ప్రధాన ప్రతిపక్షనేతగా ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రత్యేక హోదా, విభజన అంశాల సాధనకు వైయస్‌ పోరాటాలు చేశారు. ఏడు రోజుల పాటు ఆమరణ దీక్ష చేశారు. యువభేరీలతో ప్రతి ఊరికి వెళ్లి హోదా ప్రయోజనాలను ప్రతి ఒక్కరికి వినిపించి చైతన్యవంతులను చేశారు. పోరాటానికి భయపడి హోదా అనే మాట చంద్రబాబు గొంతులో పెకులుతుంది. దానికి కారణం వైయస్‌ జగన్‌ మాత్రమేనని ప్రజలంతా తెలుసుకున్నారు. బాబు ఎంత మోసం చేయాలని ప్రయత్నించినా వైయస్‌ జగన్‌ విశ్వప్రయత్నం కారణంగా దారిలోకి వచ్చారు. అయినా మోసం చేయాలనే ప్రయత్నమే చేస్తున్నారు. 
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వైయస్‌ఆర్‌ ఆశయాల సాధన కోసం పోరాడుతూనే ఉంటుంది. ప్రజలకు మేలు చేయాలనే తపన ఉన్న ఏకైక పార్టీ వైయస్‌ఆర్‌ సీపీ.
 
Back to Top