ప్ర‌త్యేక హోదా సాధ‌నే మా ల‌క్ష్యం

తిరుప‌తి: ప‌్ర‌త్యేక హోదా సాధించ‌డ‌మే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ల‌క్ష్య‌మ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి హోదా సాధించేందుకు ఎంత‌వ‌ర‌కు అయినా పోరాటం చేస్తామ‌న్నారు. జ‌న‌నేత అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎన్డీఏ స‌ర్కార్‌పై అవిశ్వాస తీర్మాణాన్ని పెట్టాల‌న్న దానికి తాము సిద్ధ‌మ‌ని, చంద్ర‌బాబును కూడా దీనికి ఒప్పించాలన్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల కోసం త‌మ నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్ ఎంత వ‌ర‌కు అయినా పోరాటం చేస్తార‌న్నారు. చంద్ర‌బాబు నాయుడికి ద‌మ్మూ ధైర్యం ఉంటే ఎన్డీఏ స‌ర్కార్‌పై అవిశ్వాస తీర్మానానికి సిద్ధ‌మ‌ని వైయ‌స్ జ‌గ‌న్ చేసిన స‌వాల్‌ను స్వీక‌రించాల‌ని భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి పిలుపునిచ్చారు. 
Back to Top