ప్ర‌తీకారం తీసుకునే స‌మ‌యం ఆస‌న్న‌మైంది


శ్రీ‌కాకుళం: ప్రజల సంక్షేమం కోసం వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిరంతరం జనం మధ్య ఉంటూ శ్రమిస్తుంటే.. రాష్ట్రంలో టీడీపీ నేతలు మద్యం, మైన్స్, ఇసుక మాఫియాలతో ప్రజా ధనం కొల్లగొడుతున్నారని, ఈ ధర్మయుద్ధంలో ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైందని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ భూమన కరుణాకరరెడ్డి అన్నా రు. టెక్కలి  నియోజకవర్గ సమన్వయ కర్త పేరాడ తిలక్‌ ఆధ్వర్యంలో  కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ని ర్వహించారు.  ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తున్న వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డిపై చం ద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు రాక్షస దాడులు చేస్తున్నారని, వీరికి ప్రజలే గుణపాఠం చెప్పాలని కోరారు. దోచుకుంటున్న ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మరో రీజనల్‌ కో ఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం చే స్తున్న అన్యాయాలను క్షేత్ర స్థాయిలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో రౌడీయిజం తప్ప ప్రజా పాలన కనిపించడం లేదన్నారు. ధాన్యం కొనుగోలులో అన్యాయం జరుగుతోందని, సీఎం మాత్రం ఏమీపట్టనట్టు రాజధాని పేరుతో కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీకి నష్టం కలిగించే వ్యక్తులపై చర్యలు తప్పవన్నారు. అన్ని వర్గాల వారికి ప్రభుత్వ నిరంకుశ విధానాలు వివరించాలని సూచిస్తూ మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రస్తావించారు. కార్య‌క్ర‌మంలో పార్టీ పార్లీమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతా రాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి, పేరాడ తిలక్‌, పార్టీ రాజకీ య వ్యవహారాల రాష్ట్ర కమిటీ సభ్యులు ధర్మాన కృష్ణదాస్, ధర్మాన పద్మప్రియ పాల్గొన్నారు. 

150 మంది వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌
ప‌లాస నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త అప్ప‌ల‌రాజు ఆధ్వ‌ర్యంలో వివిధ పార్టీల‌కు చెందిన 150 మంది కార్య‌క‌ర్త‌లు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. వీరికి పార్టీ రీజిన‌ల్ కో-ఆర్డినేట‌ర్లు భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావులు కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. పార్టీ కార్య‌క‌ర్త‌లు సైనికుల్లా ప‌ని చేసి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ముఖ్య‌మంత్రిని చేసుకుందామ‌ని నేత‌లు పిలుపునిచ్చారు.  


Back to Top