పాదయాత్ర ప్రజల విశ్వాసాన్ని చురగొంది

విజయనగరం: ప్రజల్లో బలమైన నమ్మకాన్ని కలిగిస్తూ భవిష్యత్తు బాగుంటుందనే భరోసాను పెంపొందిస్తూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సాగుతోందని పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. పాదయాత్రలో సమస్యలు చెప్పుకుంటున్న ప్రజలంతా వైయస్‌ జగన్‌ ధృడమైన నాయకత్వాన్ని చూశారన్నారు. వైయస్‌ జగన్‌ వస్తే ఆశలు, ఆశయాలు తీరుతాయని ప్రగాఢ విశ్వాసం నెలకొందన్నారు. ప్రజా సంకల్పయాత్ర మూడు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకోబోతుందని, మరే నాయకుడు పాదయాత్ర చరిత్రను తిరగరాసే ప్రసక్తే ఉండదన్నారు. 
Back to Top