ఆధునిక నియంతలకు బాబు ముద్దు పేరు


వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు భుమన కరుణాకర్‌రెడ్డి
తిరుపతి: ప్రజా ఉద్యమాలను అణగద్రొక్కుతున్న చంద్రబాబు ఆధునిక నియంతలకు ముద్దుపేరు అని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు భుమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. నియంతలు ఎవరూ కూడా పూర్తికాలం పాలించిన చరిత్ర లేదన్నారు. ఏపీ బంద్‌ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబును చూసి హిట్లర్‌ కూడా సిగ్గుపడుతారని, ముస్సోలోని మూర్ఛపోతారని అభివర్ణించారు. హోదా ఉద్యమంపై ఉక్కుపాదం మోపిన చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలని కోరారు.
 
Back to Top