ఓటుకు కోట్లు కేసులో బాబే ముద్దాయి

హైదరాబాద్‌:  ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబే ముద్దాయని అని, ఆయనను ఏ రోజు కూడా తెలంగాణ పోలీసులు విచారణకు పిలువ లేదని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు ఇంతకాలం ఎవరైనా మేనేజ్‌ చేసుకోగలమన్న విశ్వాసంతో మోడీ ప్రభుత్వాన్ని భుజాల మీద మోసి, ఈ రోజు తనకు ఏమీ కాదులే అన్న స్థాయిలోకి వెళ్లారన్నారు. ఇవాళ కేసీఆర్‌ ఈ కేసుపై విచారణ చేపట్టినట్లు వార్తలు రావడంతో చంద్రబాబుకు వణుకు మొదలైందన్నారు. ఈ కేసులో నిజమైన దోషులను బయటకు తీసే విధంగా చిత్తశుద్ధితో కేసీఆర్‌ప్రభుత్వం వ్యవహరించాలని డిమాండు చేశారు. 
 

తాజా ఫోటోలు

Back to Top